మురళీమోహన్‌ ను పరామర్శించిన చిరంజీవి దంపతులు

Chiranjeevi , Murali Mohan, Surekha
Chiranjeevi , Murali Mohan, Surekha

హైదరాబాద్‌: టిడిపి మాజీ ఎంపి మురళీమోహన్‌ ను మెగస్టార్‌ చిరంజీవి పరామర్శించారు. అయితే మురళీమోహన్ ఇటీవలే వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి, హైదరాబాదులో ఉన్న తన నివాసంలో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, తన భార్య సురేఖతో కలసి మురళీమోహన్ ఇంటికి చిరంజీవి వెళ్లారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/