Mega154 డబ్బింగ్ మొదలు

గాడ్ ఫాదర్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి సెట్స్ ఫై ఉన్న చిత్రాలతో పాటు తదుపరి చిత్రాలపై ఫోకస్ చేసారు. ప్రస్తుతం కొత్త కథలను వింటూనే..సెట్స్ ఉన్న చిత్రాలను పూర్తి చేస్తున్నాడు. మెగా 154 మూవీ గా బాబీ డైరెక్షన్లో ఓ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాలూకా డబ్బింగ్ పనులు ఈరోజు శుక్రవారం నుండి మొదలుపెట్టారు.

శుక్రవారం ఉదయం పూజా కార్యక్రమంతో ప్రారంభించినట్లుగా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే.. ముందుగా ప్రకటించినట్లుగా 2023 సంక్రాంతికి సినిమాని విడుదల చేసే విధంగా ప్లాన్ చేసి షెడ్యూల్ ప్రకారం పనులు జరుపుతున్నారని తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని – వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.