బిజెపివైపు మెగాస్టార్‌ అడుగులు?

chiranjeevi
chiranjeevi, tollywood actor

మెగాస్టార్‌ చిరంజీవి బిజెపిలో చేరుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన బిజెపి దక్షిణాదిన కూడా పాగా వేయాలని చూస్తుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలను తమ పార్టీలోకి రప్పించుకునేలా పావులు కదుపుతోంది. ఇప్పటికే తెలుగు దేశం నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు అంబికా కృష్ణ వంటి నాయకులు బిజెపిలో జాయిన్‌ అయ్యారు.
ఐతే ఆపరేషన్‌ కమలంలో భాగంగా ఏపిపై బిజెపి ప్రత్యేక దృష్టి సారించింది. ఏపిలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని తమ పార్టీలోకి తీసుకురావడానికి బిజెపి అధిష్టానం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా కొందరు బిజెపి రాష్ట్ర నాయకులు ఇప్పటికే చిరంజీవితో మంతనాలు జరుపుతున్నారని వార్తలు వినపడుతున్నాయి. చిరంజీవి బిజెపిలో జాయిన్‌ ఐతే ఆయనకు రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవితో పాటు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇవ్వడానికి అధిష్టానం సిద్దంగా ఉన్నట్లు సమాచారం.

వార్త ఈ పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/