చరణ్, బన్నీ లు నాకే సపోర్ట్ ఇస్తున్నారని మంచు విష్ణు పెద్ద బాంబ్ పేల్చాడు

Vishnu Manchu
Vishnu Manchu

మా ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. రాజకీయ పార్టీల ఎన్నికలను మించి ఈ సారి మా ఎన్నికలు జరగబోతుండడం తో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. గత 26 ఏళ్లు గా ఎప్పుడు లేనంతగా ఇప్పుడు మా ఎన్నికలు వేడి నడుస్తుంది. మంచు విష్ణు , ప్రకాష్ రాజ్ ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఇరు సభ్యులే కాదు మద్దతు ఇస్తున్న వారు సైతం విమర్శలు , ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఇక మొదటి నుండి మెగా సపోర్ట్ ప్రకాష్ రాజ్ కే అని ప్రచారం జరుగుతుంది. నాగబాబు సైతం తమ సపోర్ట్ ప్రకాష్ రాజ్ కే అని ఆయనను గెలిపించి తీరుతామని తెలుపడం జరిగింది.

ఇదిలా ఉంటె మెగా ఫ్యామిలీ హీరోలు తనకు మంచి స్నేహితులని విష్ణు చెప్పుకొచ్చారు. బన్నీ, చరణ్ తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు. బన్నీ, తాను తరచూ చాటింగ్ చేసుకుంటూ ఉంటామన్నారు. శిరీశ్ తన తమ్ముడైతే.. తేజ్ చిన్న తమ్ముడన్నారు. చరణ్, మనోజ్, తన సోదరి లక్ష్మి మంచి మిత్రులన్నారు. వారు తరచూ కలుస్తుంటారని, తాను ఎక్కువగా కలువనని తెలిపారు. మెగా హీరోలతో తనది ఇప్పటి అనుబంధం కాదని, తాను చెప్పిన వారంతా తనకే సపోర్ట్ చేస్తున్నారని విష్ణు తెలిపారు. అలాగే నాగబాబు ఫై కాస్త ఫైర్ అయ్యారు. నాగబాబు డైలాగ్ బాగుందని, దానిని తన తర్వాతి సినిమాలో వాడుకుంటానని సెటైర్లు వేశారు.