చింతమడక చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది

సూపర్ స్పెషాలిటీ వైద్యుల ప్రత్యేక చికిత్స 

Harish-Rao
Harish-Rao

సిద్దిపేట్‌: ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సోమవారం సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో యశోద ఆస్పత్రి సౌజన్యంతో నిర్వహిస్తున్న మెగా ఉచిత వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు చింతమడక గ్రామంలో నిర్వహించిన స మగ్ర ఆరోగ్య సూచిక తయారీ ఒక చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని హరీశ్‌రావు అన్నారు. సిఎం కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం చిం తమడక గ్రామంలో కార్పొరేట్ వైద్యులతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు దేశంలోనే మొదటి ఆరోగ్య సూచిక తయారు చేస్తున్న గ్రామంగా చింతమడక ను నిలిపారన్నారు. ఆరోగ్య తెలంగాణకు అడుగులు చింతమడక నుండే పడడం ఆన ందంగా ఉందన్నారు. ఇదొక చారిత్రక సం ఘటన అని అన్నారు. గ్రామంలోని ప్రజల కు అన్ని రకాల మౌలిక పరీక్షలు చేసి ఆరోగ్య సూచిక తయారుచేసిన మొదటి గ్రామ ంగా చింతమడక చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/