మెగా డాటర్ నిహారిక నిశ్చితార్ధం

చిరంజీవి దంపతులు, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్ హాజరు

Mega Daughter Niharika Engagement Pic
Mega Daughter Niharika Engagement Pic

Hyderabad: ప్రముఖ నిర్మాత, నటుడు కె.నాగబాబు కుమార్తె నిహారిక, జొన్నలగడ్డ చైతన్యల నిశ్చితార్థం హైదరాబాదులో జరిగింది.

చైతన్య గుంటూరు రేంజి ఐజీ ప్రభాకర్ రావు తనయుడు. ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. నిహారిక, చైతన్యల పెళ్లి గురించి ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది.

తాజాగా, కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు.

తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడంతో ఇక పెళ్లి చేసుకోవడమే మిగిలింది.

నిశ్చితార్థ వేడుకలో నాగబాబు కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి దంపతులు, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్, సాయితేజ్ తదితరులు సందడి చేశారు.

దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/