నిధులులేక సమావేశాలు వాయిదా వేస్తున్న ఐక్యరాజ్యసమితి

antonio guterres
antonio guterres

న్యూయార్క్‌: ఐక ్యరాజ్యసమితికి నిధుల ఏర్పడినందున ఖర్చు తగ్గించుకోవడానికి వివిధ సమావేశాలను, సదస్సులను వాయిదా వేయనున్నామని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ వెల్లడించారు. ప్రస్తుతం యుఎన్‌ 230 మిలియన్ల డాలర్ల లోటుతో ఉన్నట్లు చెప్పారు. ఉన్న నిధులు కూడా అక్టోబర్‌ ఆఖరుకు అయిపోయే అవకాశముందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి సచివాలయంలో పనచేసే 37 వేల మంది ఉద్యోగులకు ఆయన లేఖ రాశారు. అందులో ఈ అంశాలను ప్రస్తావించారు. వీటిపై చర్యలు తీసుకోనున్నట్లు కూడా తెలిపారు. 2019లో సాధారణ బడ్జెట్‌కు సభ్య దేశాల నుంచి కేవలం 70 శాతం నిధులు మాత్రమే లభించాయని, సెప్టెంబర్‌ చివరికి 230 మిలియన్‌ డాలర్ల నగదు లోటు ఏర్పడింది. ఈ నెలచివరికి ఉన్న నిధులు అయిపోతాయని అందుకే సమావేశాలు, సదస్సులు వాయిదా వేస్తున్నటు చెప్పారు. కొన్ని సేవలను కూడా తగ్గించనున్నట్లు , అతి ముఖ్‌యమైన పర్యటనలు మినహా బగిలిన వాటిపై ఆంక్షలు విధించనున్నట్లు చెప్పారు. ఇందువల్ల నిధులు ఆదా అవుతాయన్నారు.అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం సభ్యదేశాల నిర్లక్ష్యమేనన్నారు. నగదు కొరత ఏర్పడుతుందని గ్రహించి గుటెరస్‌ ఈ సంవత్సరారంభంలోనే సభ్యదేశాలను హెచ్చరించారు. ఆ దేశాలు చెల్లించాల్సిన మొత్తాన్ని వీలైనంత త్వరగా జమచేయాలిలని సూచించారు. 2018-19 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి 5.4 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ను నడిపింది. ఇందులో 22 శాతం నిధులు అమెరికా ద్వారా వచ్చినవి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/