వీళ్లకు అమిత్‌ షా లాంటి వారే కరెక్టు


Meeting with Leaders of Kadapa & Rajampet Parliament Constituencies

తిరుపతి: ఎదురు దెబ్బలు ఉంటాయని తెలుసునని, ఎన్ని కష్టాలు ఎదురైనా మార్పు తెచ్చేందుకే పార్టీ కంకణం కట్టుకుందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తిరుపతిలో జరిగిన న్యాయవాదుల సమావేశంలో అన్నారు. న్యాయవాదులకు కనీస సదుపాయాలను కోర్టుల వద్ద కల్పించాలనానరు. న్యాయవాదులు కూడా రాజకీయాల్లో రాణించాలని ఆయన పిలుపు నిచ్చారు. ప్రజల కష్టాలను చూస్తూ ఉండలేక ఎంతో కష్ట సమయంలో పార్టీ పెట్టానని పవన్‌ అన్నారు. రాయలసీమను కొన్ని అరాచక గ్రూపులు కబ్జా చేశాయన్నారు, కానీ వారుకూడా సాధారణ మనుషులేనని మర్చిపోయారన్నారు. రాబోయే భవిష్యత్తు తరాలకోసమే తాను తపిస్తున్నానని ఆయన చెప్పారు. ఇలాంటి వారికి కేంద్రహోంమంత్రి అమిత్‌ షా లాంటి వారే సరిపోతారని, ఉక్కుపాదంతో ఆయనలా అణచివేసే వారికే వాళ్లు భయపడతారంటూ వైఎస్‌ఆర్‌సిపిని ఉద్దేశించి పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/