రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం

Pawan Kalyan Meeting with Farmers of Velagathodu

తూర్పుగోదావరి: ఎపి సిఎం జగన్ ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తూర్పుగోదావరి జిల్లా వెలగతోడులో జరిగిన రైతుల సమావేశంలో మాట్లాడిన ఆయన..  ఓట్ల కోసం జగన్ రోడ్లు పట్టుకొని తిరిగారని, పాదయాత్రలో రైతులకు అండగా ఉంటామని చెప్పిన పవన్ కల్యాణ్.. ఆకాశంలో ప్రత్యేక విమానంలో తిరుగుతున్నారని ఆరోపించారు. జగన్ తీరు ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు ఉందని అన్నారు. సిఎం జగన్ ముందుకు వచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని అన్నారు. కొందరు పవన్ సభలకు వెళ్లొద్దని హెచ్చరించినట్లు తన దృష్టికి వచ్చిందని, ఇదేమి తీరని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వమైనా సరే.. రైతు కడుపు కొడితే కాలిపోవాల్సిందేనని హెచ్చరించారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రైతులకు అండగా తాను ఉంటానని, న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. 

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/