మూడురంగాలకు జిఎస్‌టి తగ్గింపుపై గోవా భేటీ

GST
GST

న్యూఢిల్లీ: జిఎస్‌టి మండలి సమావేశం అవుతున్న తరుణంలో కొత్తగా సిమెంట్‌, బిస్కెట్‌ రంగాలు పన్నుపోటును తగ్గించాలనికోరుతున్నాయి. ఈనెల 20వ తేదీ గోవాలో జిఎస్‌టి మండలి ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్‌ అధ్యక్షతన సమావేశం అవుతోంది. ఆటోమొబైల్‌, బిస్కెట్‌, సిమెంట్‌ రంగాలు ఇపుడు ఎక్కువగా పన్నుశ్లాబ్‌ను తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అలాగే సుంకాలను సైతం తగ్గించాలని కొన్నింటికి మినహాయించాలని కోరుతున్నాయి. విభిన్న రంగాలకు సంబంధించి పన్నురేట్‌ను హేతుబద్ధం చేయాల్సిన అవసరం ఉందని ఈ రంగాల తొలినుంచి డిమాండ్‌ చేస్తున్నాయి. ఇక పరిహారంసెస్‌ రూపంలో వసూలు చేస్తున్న మొత్తంపై ప్రతికూలత వ్యక్తం అవుతోంది. జిఎస్‌టి పరిహారనిధిగా చెబుతున్న ఈమొత్తం రాష్ట్రాలకు పరిహారంగా చెల్లించేందుకు వినియోగిస్తారు. రాబడులు తగ్గినపక్షంలోను, లక్ష్యాలకు తక్కువగా ఉన్నపుడు ఈసెస్‌నుంచే రాష్ట్రాలకు బదలాయిస్తారు. ఆటోమొబైల్స్‌లో ప్రస్తుతం 28 శాతం ప్లస్‌ సెస్‌, బిస్కట్లపై 18శాతం చొప్పున వసూలుచేస్తున్నారు. సిమెంట్‌రంగంపై 28శాతం పన్నువిధిస్తున్నారు. ఈరంగాలన్నీ ఇపుడు రేట్‌కట్‌ కోరుతున్నాయి. రెస్టారెంట్‌రంగాలుమాత్రం రెండురకాల పనునవిధానాన్ని అమలుచేయాలని ప్రస్తుతంఐదుశాతం ఎలాంటి ఐటిసిలేకుండా చేయాలని అంచనా.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/