బిజెపి కొత్త జాతీయాధ్యక్షుని ఎంపికకు సమావేశం

హాజరైన బిజెపి సీనియర్‌ నేతలు

meeting for new BJP chief
meeting for new BJP chief

న్యూఢిల్లీ: బిజెపి పార్టీ నూతన జాతీయాధ్యక్షుడి ఎంపిక కోసం ప్రధానధికారులతో సమావేశమైంది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో అమిత్‌ షా అధ్యక్షతన రెండు రోజుల పాటు బిజెపి ఈ సమావేశం జరగనుంది. పార్టీ బలోపేతం, సభ్యత్వాల పెంపు వంటి అంశాలపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. ఐతే మరోసారి కూడా అమిత్‌ షానే బిజెపి జాతీయాధ్యక్షుడిగా కొనసాగనున్నారని సమాచారం. త్వరలో బిజెపి పాలిత రాష్ట్రాలైన హర్యానా, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరికొంత కాలం షానే అధ్యక్షుడిగా కొనసాగించాలని బిజెపి నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ప్రస్తుతం జరిగే సమావేశంలో స్పష్టత రానుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/