నాని ‘మీట్ క్యూట్’ టీజర్ చూసారా..?

ఓ పక్క వరుస సినిమాలు చేస్తూనే మరోపక్క వాల్ పోస్టర్ పేరుతో నిర్మాణ సంస్థను నిర్మించి వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా ‘మీట్ క్యూట్’ అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి గంట దర్శకత్వం వహించడం విశేషం. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ తాలూకా పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీజర్ ను రిలీజ్ చేసి సినిమా ఫై ఆసక్తి పెంచారు.

ఈ సినిమాలో అందరూ యంగ్ హీరోహీరోయిన్స్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి ఒక్కరి ఇద్దరి కలయిక వారి మధ్య వచ్చే మాటలు ప్లెజెంట్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఒక కథలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. రోహిణి మొల్లేటి, అదా శర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచ ఫీమేల్ లీడ్స్ గా, అశ్విన్ కుమార్, శివ కందుకూరి , దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా కథానాయకులుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటిటి సంస్థ సోనీ లివ్ లో రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.