ఏపీలో నేటి నుంచి ‘మీ సేవ’ ఛార్జీలు పెంపు

అమరావతి : ఏపీలో మీ సేవ కేంద్రాల ద్వారా అందించే సేవలకు వసూలు చేసే సర్వీసు ఛార్జీలను ప్రభుత్వం నేటి నుంచి పెంచింది. కేటగిరి – ఎ, కేటగిరి – బి కింద అందించే సేవలకు వసూలు చేసే ఛార్జీలను రూ. 5 మేర పెంచింది. దీని ద్వారా ఏడాదికి సుమారు రూ. 60 కోట్ల భారం సామాన్య ప్రజలపై పడనుంది. ఇప్పటికే వివిధ ఛార్జీలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో… ఈ పెంపుతో వారిపై అదనుపు బాదుడు మోపుతుంది.

మీ సేవ ద్వారా వివిధ విభాగాలకు చెందిన సుమారు 512 రకాల సేవలు అందుతాయి. దీనికి సర్వీసు ఛార్జీ కింద ఎ కేటగిరి కింద 35, బి కేటగిరి కింద 45 రూపాయల వంతున ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఇందులో నిర్వాహకులకు చెల్లించే మొత్తం పోనూ… మిగిలిన మొత్తం ప్రభుత్వం ఖాతాలో జమ అవుతుంది. ఇవాళ్టి నుంచి సర్వీసు ఛార్జీలను మార్పు చేస్తున్నట్లు నిర్వాహకులకు సంబంధింత శాఖ ఆదివారం సాయంత్రమే సమాచారం పంపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/