పవన్ కళ్యాణ్ కు అక్కగా మీనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ డైరెక్షన్లో రానా తో కలిసి భీమ్లా నాయక్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ని సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని అనుకున్నారు కానీ సంక్రాంతి బరిలో ఆర్ఆర్ఆర్ , రాధే శ్యామ్ మూవీస్ ఉండడం తో థియేటర్స్ సమస్య తలెత్తడం తో రేసు నుండి భీమ్లా నాయక్ తప్పుకుంది. ఫిబ్రవరి 25 న మహాశివరాత్రి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో పాటు క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు చేస్తున్నాడు. అలాగే గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేయనున్నాడు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజ్ కాగా… మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా ఈ సినిమా తాలూకా ఓ వార్త అభిమానుల్లో ఆసక్తి నింపుతుంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్క పాత్రలో… అలనాటి స్టార్ హీరోయిన్ మీనా నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు చేసిందట చిత్రబృందం. ఈ పాత్రలు చేసేందుకు మీనా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ వార్తపై త్వరలోనే క్లారిటీ రానుంది.