కేరళ ఏనుగు ఘటన కలచివేసింది.. రతన్ టాటా

కఠిన చర్యలు తీసుకోవాలన్న కోహ్లీ, అక్షయ్, నటి ప్రణీత

Ratan Tata On Pregnant Elephant’s Death In Kerala

ముంబయి: కేరళలో ఏనుగును చంపేసిన ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏనుగు మృతి ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే పారిశ్రామిక వేత్త రతన్ టాటా స్పందించారు. అమాయక ఏనుగును క్రూరంగా చంపిన ఘటన తనను కలచివేసిందని ఆయన తెలిపారు. ఇటువంటి అమాయక జంతువులపై హత్యను సాటి మనుషుల హత్యగానే పరిగణించాలని కోరారు. ఏనుగును చంపిన ఘటనను క్రికెటర్ విరాట్ కోహ్లి ఖండించాడు. బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలీవుడ్‌ నటులు అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, శ్రద్ధాకపూర్, రరణదీప్‌ హుడా, టాలీవుడ్ నటి ప్రణీత డిమాండ్ చేశారు. కాగా, ఏనుగును చంపిన వారి వివరాలు తెలిపితే రూ.50 వేల బహుమతి ఇస్తామని హ్యూమన్‌ సొసైటీ ఇంటర్నేషనల్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/