మేడిగడ్డ బ్యారేజీ 34 గేట్లు ఎత్తివేత

Medigadda Barriage
Medigadda Barriage

Bhoopalapalli: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు మేడిగడ్డ బ్యారేజీ 34 గేట్లు ఎత్తివేసి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 1.31 లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా వస్తుండగా అంతే క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా దిగువకు బదులుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 94.90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.445 టీఎంసీలు ఉంది. అన్నారం బ్యారేజీ ప్రస్తుత నీటి మట్టం 117.350 మీటర్లుగా ఉంది. కన్నెపల్లి, అన్నారం పంపుహౌజ్‌లో మోటార్లను నిలిపివేశారు.