తేజు కు ప్రమాదం జరుగగానే ఫిట్స్ వచ్చాయట

సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అపోలో లో వెంటిలేటర్ ఫై చికిత్స తీసుకుంటున్నారు. తేజు ఆరోగ్యం ఫై ఆందోలన చెందాల్సిన అవసరం లేదని , లోపలి అవయవాలన్నీ బాగానే ఉన్నాయని అపోలో డాక్టర్స్ చెప్పుకొచ్చారు. అయితే ముందుగా ప్రమాదానికి గురి కాగానే తేజను మెడికవర్‌ హాస్పటల్ లో జాయిన్ చేసారు.

ఆ సమయంలో తేజు ఎలా ఉన్నదనేది మెడికవర్‌ డాక్టర్స్ మీడియా కు తెలియజేసారు. మా ఆస్పత్రికి వచ్చేలోపు సాయిధరమ్ తేజ్‌ అపస్మారకస్థితిలో ఉన్నాడని.. అతనికి అప్పటికే ఫిట్స్ వచ్చినట్లుగా తెలిసిందని.. వెంటనే మరోసారి ఫిట్స్ రాకుండా ట్రీట్‌మెంట్‌ ఇచ్చామని వెల్లడించారు.

ప్రమాదంలో కిందపడటంతో షాక్‌కు గురికావడం ద్వారా ఫిట్స్ వస్తాయని తెలిపిన వైద్యులు.. బ్రెయిన్ కు ఏదైన ప్రమాదం జరిగినప్పుడు కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అయితే, ఆ తర్వాత బ్రెయిన్, స్పైనల్ కార్డ్, షోల్డర్, చెస్ట్ అబ్‌డామిన్ స్కానింగ్‌లు చేశామని.. బ్రెయిన్‌, స్పైనల్ స్కానింగ్ రిపోర్టులు నార్మల్‌గా వచ్చాయని తెలిపారు. ఇక, భుజం దగ్గర ఉన్న కాలర్ బోన్ ఫ్యాక్చర్ అయ్యిందని.. లక్కీగా ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కడా లేదని స్పష్టం చేశారు. చాతిపై గాయాలు ఉన్నాయని.. హెల్మెట్ పెట్టుకోవడంతో లక్కీగా అతని తలకు గాయాలు కాలేదన్నారు. కాకపోతే శ్వాస తీసుకోవడానికి కొంత ఇబ్బంది పడ్డాడని.. దీంతో కృతిమ శ్వాస పెట్టాల్సి వచ్చిందని.. అపస్మారక స్థితిలో ఉన్నాడు కాబట్టి కృతిమ శ్వాస ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు.