గోరంటాకులో ఔషధ గుణం

ఇంటింటా చిట్కాలు-

medicinal-properties-of-hennamedicinal-properties-of-henna
medicinal-properties-of-henna

సాధారణంగా గ్రామ ప్రాంతాల్లో అన్ని ఇళ్లల్లోను ఈ చెట్టు ఉంటుంది. గోరింటాకు ఇష్టపడని తెలుగింటి ఆడపడుచులెవరూ ఉండరు.

కాబట్టి ఇది ప్రసిద్ధమైన మొక్క. గోరింటాకు కేవలం చర్మానికి ఎర్రరంగును కలిగించేందుకే అనుకుంటే పొరపాటు. వైద్యపరంగా, దీనికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.

ఎంతకాలానికి మాడని పుండుపైన గోరింటాకు రుబ్బి కట్టు కడితే పుండు త్వరగా మాడుతుంది.

గోరింటాకు ముద్దని నీళ్లలో వేసి మరిగించి ఆ నీళ్లను చల్లార్చి కాలిన గాయాలపై తడి పితే నొప్పి, వాపు, పోట్లు తగ్గు తాయి.

నోటి పూతకు కూడా ఈ గోరిం టాకు నీళ్లను మరిగించి పుక్కిలిస్తే త్వరగా తగ్గుతుంది. స్ఫోటకం, పొంగులాంటివి వచ్చినప్పుడు అరికాళ్లకు, అరిచేతులకు గోరింటాకు పెడితే వ్యాధి తీవ్రత తగ్గుతుంది.

ఈ గోరింటాకులో నువ్వులనూనె, మునగచెట్టు బంక కలిపి పట్టు వేస్తే వాపులు, నొప్పులూ తగ్గుతాయి. గోరింటాకును ఎండబెట్టి, పొడిచేసి ఒళ్లంతా పట్టిస్తే గజ్జి, దురదలు, చిదుములాంటివి తగ్గుతాయి.

ఈ పొడికి సమానంగా నీరు కలిపి నూనెలో వేసి తైలపాకం ప్రకారం నూనె మాత్రమే మిగిలేలా కాచి ఆ నూనెను ఎలాంటి ఇన్ఫెక్షన్ల మీద అయినా రెండు మూడు చుక్కలు వేస్తే చాలు చక్కగా పనిచేస్తుంది.

కాలిన చోట చర్మం మాడిపోయి కొత్తచర్మం రావడానికి ఆలస్యం అవ్ఞతున్నప్పుడు, గోరింటాకుని రుబ్బి అక్కడ పట్టువేస్తే చర్మం మామూలు రంగులోకి వచ్చి కలిసిపోతుంది.

కుష్టురోగానికి కూడా ఇది చాలా మంచిది.

ఎలర్జీ వ్యాధుల్లో గోరింటాకు చెట్టు కాండంపైన చెక్కని పొడిచేసి నీళ్లలో వేసి కాచి, వాటిని తక్కువ మోతా దులో రోజు తాగితే, శరీరత్వం మారు తుందంటారు. ప్రయత్నించి చూస్తే తప్పులేదు.

ఈ కషాయాన్ని అన్ని చర్మరోగాలకు పథ్యంగా ఇవ్వవచ్చు. ఈ కషాయంతో గాయాలను కడిగితే మంచిది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/