నిందితులకు పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు

హైదరాబాద్: భారీ ర్యాలీలు, ఆందోళనలతో శంషాబాద్, షాద్ నగర్ ప్రాంతం అంతా జన సముద్రాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం నిందితులు ఉన్న షాద్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు నిరసనకు దిగి, నిందితులను తమకు అప్పగించాలని వారి అంతు చూస్తామని నినాదాలతో హోరెత్తిస్తున్నారు. నిందితులను కోర్టుకు తరలించే ముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. దీంతో వారిని షాద్ నగర్ ఆసుపత్రికి తరలిద్దామని పోలీసులు భావించారు. అయితే, వారిని బయటకు తీసుకెళ్లే పరిస్థితులు లేకపోవడంతో వైద్యులనే ఆసుపత్రికి పిలిపించారు. పోలీస్ స్టేషన్ లోనే నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జడ్జీలు అందుబాటులో లేకపోవడంతో నిందితులను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తహసిల్దార్ ఎదుట హాజరుపరిచే అవకాశముంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/