ప్రారంభమైన ఏడుపాయల జాతర

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్‌రావు

మెదక్: జిల్లాలోని పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లిలో ఏడుపాయల జాతర గురువారం ఉదయం వైభవంగా ప్రారంభమైంది. వనదుర్గా భవానీ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ..రాష్ట్రం వచ్చాక ఏడుపాయల ఉత్సవాలు దినదినాభివృద్ది జరుగుతున్నాయన్నారు.

జాతర కోసం సింగూరు నుంచి 0.35 టీఎంసీల నీళ్లు విడుదల చేశామని తెలిపారు. పోతం శెట్టిపల్లి నుంచి రూ.36 కోట్లతో 100 ఫీట్ల రోడ్డును అందుబాటులోకి తెస్తామన్నారు. అమ్మవారి దయతో ఈ ప్రాంతం సుభిక్షమవుతుందని ఆకాంక్షించారు. కాళేశ్వరం నీళ్లతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నామని…కోటి ఎకరాల పంట సాగు అవుతోందని చెప్పారు. దేశంలోనే కోటి ఎకరాలు సాగుచేసి మొదటి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర పుటల్లోకి ఎక్కిందన్నారు. సీఎం కృషి వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు. ఏడుపాయల్లో పోలీస్ అవుట్ పోస్ట్, ఏటీఎంలను ఏర్పాటు చేశారని…రూర్బన్ పథకం నుంచి ఏడుపాయల్లో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/