RTC బస్సులో ప్రయాణించిన కలెక్టర్

ఆర్టీసీ బస్సుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్సులో మెదక్ నుంచి నర్సాపూర్ వరకు ప్రయాణించి అధికారులకు సర్ప్రైజ్ ఇచ్చారు.

కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. రాహుల్ రాజ్ త‌న‌ కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్తుండగా మెదక్ పట్టణంలో ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మెదక్ నుంచి నర్సాపూర్ చేరుకున్నారు. అనంతరం సొంత వాహనంలో హైదరాబాద్ వెళ్లారు. సామాన్యుల జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం గమనార్హం.