కౌలాలంపూర్‌ ఎయిర్‌పోర్టులో భారతీయులకు భోజనం, వసతి

మలేసియా తెలుగు ఫౌండేషన్‌ సహాయం

NRI..s in Airport

కరోనా వ్యాప్తి ప్రభావంతో అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిషేధం విదితమే.. మలేసియాలో ఈనెల 18 నుంచి 31 వరకు విమాన సర్వీసులను పూర్తిగానిలిపివేశారు..

అంతేకాకుండా భారత ప్రభుత్వం కూడ విమానయాన రాకపోకలను నిషేధించటంతో మలేసియా కౌలాలంపూర్‌ ఎయిర్‌పోర్టులో వందలాది భారతీయులు చిక్కుకున్నారు.

వీరిలో ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు..

దీంతో మలేసియా తెలుగు ఫౌండేషన్‌ (ఎంటిఎఫ్‌) అధ్యక్షుడు కాంతారావు మలేసియా ఇండియన్‌ హైకమిషన్‌ సహాయంతో వారు ఇండియాకు వెళ్లేదాకా భోజనం, రవాణా వసతి సౌకర్యాలను ఈనెల31వరకు అందించటానికి ముందుకొచ్చింది ఎంటిఎఫ్‌..

ఈమేరకు సహాయం అందిస్తున్న మలేసియా తెలుగు ఫౌండేషన్‌ దాతో కాంతారావు అక్కునాయుడు, వారి కమిటీ సభ్యులు జనరల్‌ సెక్రటరీ ప్రకాష్‌రావు, ట్రెజరర్‌ స్రీన్‌ జివి, కె ల ఎక్సకో జగదీష్‌రావు తదితరులకు మలేసియాలోని తెలుగు రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/