మసాలా ఉత్పత్తుల అధినేత కన్నుమూత

mdh-owner-mahashay-dharampal

న్యూఢిల్లీ: ప్రముఖ మసాలా ఉత్పత్తుల సంస్థ ఎండీహెచ్‌ అధినేత, పద్మభూష్‌ గ్రహీత మహాషై ధర్మపాల్‌ గులాటీ(98) కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా ఆయన ఢిల్లీలోని మాతాచానన్‌ దేవి హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ధరంపాల్‌ గులాటీని ‘దాదాజీ’ ‘మహాషైజీ’ని అని పిలుస్తుంటారు. 1923లో పాకిస్థాన్‌లోని సియోల్‌కోట్‌లో జన్మించారు. ధరంపాల్‌ గులాటి తండ్రి సియోల్‌కోట్‌లో మసాలాల వ్యాపారం ప్రారంభించారు. దేశ విభజన అనంతరం ఆయన ఢిల్లీలోని కరోల్‌భాగ్‌లో ఓ షాప్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి మహాషై ధరంపాల్‌ గులాటి దేశంలోనే ప్రముఖ కంపెనీగా ఎండీహెచ్‌ను తీర్చిదిద్దారు. ఆయన మృతిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా సంతాపం ప్రకటించారు. ఆయనను కలిసిన సందర్భంగా ఫొటోలను ట్వీట్‌ చేశారు. ధరంపాల్ గులాటి తన జీవితాన్ని సమాజం కోసం అంకితం చేసిన వ్యక్తని కేజ్రీవాల్‌ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/