విదేశాల్లో ఎంబిఎ సులభమే

విదేశీ విద్య లక్ష్యంగా అడుగులేస్తున్న వారిలో ఎక్కువమందికి ఎంబిఎ లేదా ఇతర మేనేజ్‌మెంట్‌ కోర్సులు లక్ష్యంగా ఉంటున్నాయి. ఇందులో భాగంగానే విదేశీ వర్సిటీల్లోని మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి అవసరమైన అర్హతను అందించే జీమ్యాట్‌కు అధిక సంఖ్యలో విద్యార్ధలు హాజరవుతున్నారు. జీమ్యాట్‌ నిర్వాహక సంస్థ గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ కౌన్సిల్‌ (జీమ్యాట్‌) గణాంకాల ప్రకారం గత నాలుగేళ్లలో జీమ్యాట్‌ టెస్ట్‌కు హాజరైన వారి సంఖ్యలో 12 శాతం మేర పెరుగుదల నమోదైంది. భవిషత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఎంబిఎ చదివేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలపై ప్రత్యేక కథనం.

మనదేశంలో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌) ఇతర ప్రవేశ పరీక్షలకు బిటెక్‌ విద్యార్ధులు ఎక్కువగా హాజరవుతున్న సంగతి తెలిసిందే, ఇదే పరిస్థితి విదేశీ విద్య విషయంలోనూ కనిపిస్తోంది. జీమ్యాట్‌ టెస్ట్‌ టేకర్స్‌లో దాదాపు 70 శాతం మేర బిటెక్‌ విద్యార్ధులే ఉండటం గమనార్హం. అమెరికా, యుకె, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌ దేశాల్లోని 60 శాతం ఇన్‌స్టిట్యూట్‌లు ట్రిపుల్‌ క్రాస్‌ గుర్తింపు పొందాయి. ఆయా ఇన్‌స్టిట్యూట్స్‌లో మేనేజ్‌మెంట్‌ కోర్సులను పూర్తిచేస్తే అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. అదే విధంగా కెరీర్‌ అవకాశాల పరంగానూ ట్రిపుల్‌ క్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ పట్టభధ్రులకు ప్రాధాన్యం లభిస్తుంది.

వీటిని దృష్టిలో పెట్టుకొని విద్యార్ధులు సదరు ఇన్‌స్టిట్యూట్స్‌లో చదివేందుకు మొగ్గుచూపుతున్నారు. సాధారణంగా మేనేజ్‌మెంట్‌ పిజి అంటే ఎంబిఎ గుర్తొస్తుంది. అయితే పలు విదేశీ యూనివర్సిటీలు ఎంబిఎతోపాటు పిజి డిప్లొమా, మాస్టర్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌, మాస్టర్స్‌ ఇన్‌ ఫైనాన్స్‌, మాస్టర్స్‌ ఇన్‌ అకౌంటింగ్‌, ఎగ్జిక్యూటివ్‌ ఎంబిఎ తదితర కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. వీటి కాలవ్యవధి రెండేళ్లలోపే ఉంటోంది. దీంతో సమయం,ఖర్చును దృష్టిలో పెట్టుకొని విద్యార్ధులు సైతం ఈ ప్రత్యేక కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నారు. మరోవైపు జాబ్‌ మార్కెట్లో ఆయా కోర్సులు చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.

ఇటీవల కాలంలో విదేశీ మేనేజ్‌మెంట్‌ కోర్సుల పరంగా యుకె ఇన్‌స్టిట్యూట్‌లకు ప్రాధాన్యం పెరుగుతోంది. అమెరికాలో నెలకొన్న ఆంక్షల వాతావరణం నేపధ్యంలో భారత విద్యార్ధులు యుకె,
ఫ్రాన్స్‌ల వైపు దృష్టిసారిస్తున్నారు. దీంతోపాటు ఆయా దేశాల్లోని ఇన్‌స్టిట్యూట్‌లలో14 నుంచి 18 నెలల వ్యవధిలో మేనేజ్‌మెంట్‌ పిజి పూర్తిచేసే అవకాశముంది. ఈ పరిస్థితి విద్యార్ధులను ఆకర్షిస్తోంది.

మేనేజ్‌మెంట్‌ పిజి, ఎంబిఎ, స్పెషలైజేషన్‌పరంగా భారత విద్యార్ధులు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ పట్ల ఆసక్తి చూపుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. బిటెక్‌ నేపథం ఉన్న విద్యార్ధుల్లో ఈ దృక్పథం కాస్త ఎక్కువగా కనిపిస్తోంది.

ఎంటర్‌ప్రెన్యుర్‌షిప్‌ స్పెషలైజ్డ్‌ ప్రోగ్రామ్స్‌ అందుబాటు, వాటి అభ్యసనతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా రాణించేందుకు అవసరమైన నైపుణ్యాల లభ్యత, మార్కెట్‌ పరిస్థితులు, నెట్‌ వర్కింగ్‌, క్రాస్‌ కల్చరల్‌ రిలేషన్స్‌పై అవగాహన పెంపొందించేలా కరిక్కులం రూపకల్పన తదితరాలు విదేవీ ఇన్‌స్టిట్యూట్‌లను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. దీంతో వాటిలో చదివిన వారు స్టార్టప్స్‌ను ఏర్పాటు చేసి విజయంతంగా నడిపించగలుతున్నారు.

విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లు అనుసరిస్తున్న సరళీకృత, ప్రాక్టికల్‌ టీచింగ్‌ విధానం విద్యార్ధులను ఆకర్షిస్తోంది. అక్కడ సబ్జెక్టు అంశాలకు రియల్‌టైమ్‌ కేస్‌ స్టడీలను అన్వయిస్తూ బోధిస్తున్నారు. ఈ విషయంలో భారత్‌ ఇన్‌స్టిట్యూట్‌లు వెనుక వరుసలో ఉన్నాయి. ఐఐఎంలు, ఇతర టూర్‌-1 ఇన్‌స్టిట్యూట్‌లు ఇప్పుడిప్పుడే కేస్‌స్టడి అప్రోచ్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. కానీ టైర్‌-2 ఇన్‌స్టిట్యూట్‌లు ఈ విషయంలో పూర్తిగా వెనకబడ్డాయి.

విదేశీ మేనేజ్‌మెంట్‌ కోర్సుల పరంగా విద్యార్ధులకు అనుకూలంగా కనిపిస్తున్న మరో అంశం, ఆధునిక సిలబస్‌ ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు, పరిశ్రమ అవసరా లకు అనుగుణంగా విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లు ఎప్పటికప్పుడు సిలబస్‌లో మార్పులు చేస్తున్నాయి.ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు స్వయం ప్రతిపత్తి ఉండటం విద్యార్ధులకు కలిసొస్తోంది. కెరీర్‌ అవ కాశాలు అందిపుచ్చుకోవడంలో కీలకంగా మారే, రియల్‌ టైం ఎక్స్‌ పీరియెన్స్‌, దానికి మార్గం వేసే ఇంటర్న్‌షిప్స్‌ను కరిక్కులంలో భాగంగా తప్పనిసరి విధానంగా అమలు చేస్తున్నాయి.

మన దేశంలోనూ ఐఐఎంలు, ఇతర ప్రముఖ బి-స్కూల్స్‌లో ఈ విధానం అమలవుతున్నప్పటికీ, ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు ఈ విషయంలో వెనకబడి ఉన్నాయి. మేనేజ్‌మెంట్‌ కోర్సులు క్రేజీగా మారుతున్నప్పటికీ విద్యార్ధులు కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రధాన సమస్య పని అనుభవం లేకపోవడం. యుకె, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌ తదితర దేశాల్లోని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు మేనేజ్‌మెంట్‌ పిజి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నపటికీ, టాప్‌ యూనివర్సిటీలు మాత్రం వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ను తప్పనిసరి చేస్తున్నాయి. అయితే దీన్ని భారతీయ విద్యార్దులు సమస్యగా భావించడం లేదు. బిటెక్‌, ఇతర బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు పూర్తిచేశాక ఏదో ఇక సంస్థలోపని అనుభవం గడించి మేనేజ్‌మెంట్‌ కోర్సులు వైపు దృష్టిసారిస్తుండటం గమనార్హం.

జీమ్యాట్‌ గణాంకాల ప్రకారం మొత్తం టెస్ట్‌ టేకర్స్‌లో పని అనుభవం ఉన్నవారి సంఖ్య 25 శాతం మేర ఉండటమే ఇందుకు నిదర్శనం. స్టడి అబ్రాడ్‌ మేనేజ్‌మెంట్‌ పిజి, నిబంధనలు విదేశాల్లో మేనేజ్‌మెంట్‌ పిజి ప్రవేశాలు పొందే క్రమంలో విద్యార్ధులు తప్పనిసరిగా కొన్ని నింబధనలు పాటించాలి. అవిజీమ్యాట్‌ స్కోర్‌ (600కుపైగా స్కోర్‌తో అత్యున్నత సంస్థల్లో ప్రవేశానికి అవకాశం).అకడమిక్‌ ట్రాక్‌ రికార్డ్‌ (సీనియర్‌ సెకండరీ నుంచి అండర్‌ గ్రాడ్యుయేషన్‌ వరకు 7కు పైగా జిపిఎ)లాంగ్వేజ్‌ టెస్ట్‌లలో ఉత్తమ స్కోర్లుపని అనుభవం.

ఏ కోర్సుకు ఎంతమంది?

జీమ్యాట్‌ నిర్వాహక సంస్థ జీమ్యాట్‌ విశ్లేషణ ప్రకారం భారత విద్యార్ధులు ప్రాధాన్యమిస్తున్న కోర్సులు
45.2 శాతం -పిజి డిప్లొమా: 16.8 శాతం -ఎంబిఎ ఫుల్‌టైమ్‌ (రెండేళ్ల కంటే తక్కువ వ్యవధి): 16.8 శాతం-మాస్టర్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌: 4.3 శాతం,మాస్టర్స్‌ ఆన్‌ ఫైనాన్స్‌: 2.8 శాతం- ఎగ్జిక్యూటివ్‌ ఎంబిఎ: 2.7 శాతం- పార్ట్‌టైమ్‌ ఎంబిఎ: 2.4 శాతం.

బిజినెజ్‌లో పిహెచ్‌డి:

1.8శాతం-మాస్టర్‌ ఇన్‌ డేటా అనలిటిక్స్‌/డేటాసైన్స్‌: 1.7 శాతం- మాస్టర్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/సిస్టమ్స్‌: 0.9 శాతం మేనేజ్‌మెంట్‌ పిజికి ఉత్తమ వేదికలు

స్టడి అబ్రాడ్‌, మేనేజ్‌మెంట్‌ పిజి పరంగా పేరున్న దేశాలు, సంస్థల వివరాలు

యుఎస్‌: హార్వర్డ్‌ యునివర్సిటీ, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, కెలాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, బాత్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (యూనివర్సిటీ ఆఫ్‌ షికాగొ), టక్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌

యుకె: లండన్‌ బిజినెస్‌ స్కూల్‌, జడ్జ్‌ బిజినెస్‌ స్కూల్‌, సైద్‌ బిజినెస్‌ స్కూల్‌, ఇంపీరియల్‌ కాలేజ్‌ బిజినెస్‌ స్కూల్‌, మాంచెస్టర్‌ బిజినెస్‌ స్కూల్‌

ఆస్ట్రేలియా:యూక్యూ బిజినెస్‌ స్కూల్‌, మెక్‌ క్వైర్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఎంజిఎస్‌ఎం), మెల్‌ బోర్న్‌ బిజినెస్‌ స్కూల్‌.

సింగపూర్‌: నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌, నేషనల్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, ఇన్‌సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌,సింగపూర్‌ మేనేజ్‌మెంట్‌ యూనివర్సిటీ.

కెనడా: రోట్‌మన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, ఐవి బిజినెస్‌ స్కూల్‌, సౌదర్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, డెసౌటెల్స్‌ ఫ్యాకల్టీ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌

ప్రాన్స్‌: హెచ్‌ఇసి మేనేజ్‌మెంట్‌ స్కూల్‌, ఇఎమ్‌ఎల్‌వైఒఎన్‌ బిజినెస్‌ స్కూల్‌, ఐఎన్‌ఎస్‌ఇఎడి యూరప్‌ క్యాంపస్‌, ఇడిఎహ్‌చ్‌ఇసి బిజినెస్‌ స్కూల్‌.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/