లైంగిక ఆరోపణలు..సియోల్ మేయర్ ఆత్మహత్య!

నిన్న ఇంటి నుంచి అదృశ్యమైన పార్క్ వోన్

seoul-mayer-sucide

సియోల్‌: ద‌క్షిణ కొరియా రాజ‌ధాని సియోల్ న‌గ‌ర మేయ‌ర్ పార్క్ వోన్ సూన్‌.. అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందాడు. ఈ విషయాన్ని శుక్రవారం నాడు వెల్లడించిన పోలీసులు, ఇటీవలే అతనిపై సియోల్ సిటీ ఉద్యోగి ఒకరు లైంగిక వేధింపుల కేసు పెట్టారని, ఈ కేసు విచారణ దశలో ఉందని తెలిపారు. కేసు విషయం తెలియగానే నిన్న మధ్యాహ్నం నుంచి పార్క్ వోన్ సూన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, వందలాది మంది అధికారులు ఆయన కోసం సెర్చ్ చేస్తుండగా, విగత జీవుడిగా కనిపించారని వెల్లడించారు. తన తండ్రి కనిపించడం లేదని పార్క్ కుమార్తె గురువారం నాడు పోలీసులను ఆశ్రయించగా, అప్పటి నుంచి ఆయన్ను వెతికారు. ఇంటి నుంచి వెళ్లిన తరువాత, ఆయన తనకు ఫోన్ చేశారని, అవే ఆయన చివరి మాటలుగా తనకు అనిపించిందని, ఆపై తన ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసుకున్నారని ఆమె తెలిపారు. కాగా, దక్షిణ కొరియా డెమొక్రటిక్ పార్టీలో సీనియర్ లీడర్ గా ఉన్న పార్క్ వోన్ సూన్, దాదాపు దశాబ్దకాలం పాటు సియోల్ ప్రజా ప్రతినిధిగా కొనసాగారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/