ములాయం తరఫున మాయావతి ప్రచారం

mulayam, mayawati
mulayam, mayawati


లక్నో: బహుజన్‌ సమాజ్‌ పార్టీ( బిఎస్‌పి) చీఫ్‌ మాయావతి..సమాజ్‌ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ తరఫున ప్రచారం చేయనున్నారు. మాయావతి దాదాపు 24 ఏళ్ల తర్వాత ములాయంకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ములాయం మొయిన్‌పూరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 19న మాయావతి ఆయన తరఫున ప్రచారం చేస్తారని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి వెల్లడించారు. అంతేగాక మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ కలిసి ఏప్రిల్‌-మే నెలల మధ్య కాలంలో 11 ర్యాలీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో పొత్తులో భాగంగా 37 స్థానాల్లో ఎస్పీ, 38 స్థానాల్లో బిఎస్పీకి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్‌ఎల్డీకి మూడు స్థానాలు కేటాయించగా, మిగిలిన రెండు స్థానాలు అమేథి, రా§్‌ు బరేలిలో సోనియా కాని రాహుల్‌ కాని పోటీ చేసే అవకాశం ఉంది.