ప్రజాభిప్రాయానికి విరుద్ధమైన ఎన్నికల ఫలితాలు

mayawati
mayawati


న్యూఢిల్లీ: ఈవిఎంల పనితీరును బహుజన్‌ సమాజ్‌ వాదీ అధినేత్రి మాయావతి మరోసారి లేవనెత్తారు. బిజెపి ఈవిఎంలను హైజాక్‌ చేయడం వల్లే తాము ఓటమి పాలయ్యామని, వాస్తవానికి ఇది ప్రజాభిప్రాయానికి విరుద్ధమని ,ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా ఫలితాలు వచ్చాయని మాయా అన్నారు. దేశం మొత్తం ఈవిఎంలను వ్యతిరేకించినప్పటికి బిజెపి వాటితోనే ఎన్నికలకు వెళ్లింది. ఐతే ఈ ఫలితాలను బట్టి అర్దమైంది ఏంటంటే ప్రజలు ఓడి, ఈవిఎంలు గెలిచాయనే విషయం స్పష్టమవుతుందని అన్నారు. యూపిలో బలమైన పార్టీలైన ఎస్పి-బిఎస్పి మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమిలోకి ఆర్‌ఎల్‌డి పార్టీని కూడా చేర్చుకున్నాయి. ఐతే ఈ కూటమితో యూపిలో బిజెపి భారీ స్థాయిలో ఓటమిని చవిచూడనుందని అందరూ బావించారు. దానికి విరుద్ధంగా బిజెపి మరోసారి ప్రభంజనం సృష్టించింది.
మొత్తం 80 స్థానాలకు గాను ఎన్డీఏ 62 స్థానాలు గెలుచుకుంది. మహాకూటమి మాత్రం పావువంతు సీట్లు మాత్రమే గెలుచుకుంది. బిఎస్పి 10 స్థానాలు గెలవగా, ఎస్పీ 5 స్థానాలకే పరిమితమైంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/