ఎఒబిలో భారీ బహిరంగ సభ

MAVOISTS
MAVOISTS

ఎఒబిలో భారీ బహిరంగ సభ

గురుప్రియ వంతెనకు వ్యతిరేకంగా సమావేశం
ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు విడనాడాలని హెచ్చరిక
భారీగా హాజరైన సరిహద్దు గిరిజనులు

పాడేరు (విశాఖపట్నం): ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భారీ బహిరంగసభను మంగళవారం నిర్వహించినట్టు తెలిసింది. ఈ సభకు మావోయిస్టు పార్టీ అగ్రనేత రామకృష్ణ హాజరైనట్టు సమాచారం. ఒడిశా రాష్ట్రం జన్‌బై వద్ద 100 కోట్లతో నిర్మించిన భారీ వంతెనకు వ్యతిరేకిస్తూ మావోయిస్టులు ఈ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ వంతెన కట్టడం వలన ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ఈ వంతెన వలన ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని గురు ప్రియ వంతెన ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా నిర్మాణాలు చేపట్టడం తగదని మావోయిస్టులు చర్చించినట్టు తెలిసింది. అరకు సంఘటనతో భారీగా కూంబింగ్‌లు జరుగుతున్న ఈ నేపధ్యంలో మావోయిస్టులు బహిరంగ సభ నిర్వహించడం విశేషం. ఈ సభకు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నట్టు తెలిసింది. సరిహద్దు ప్రాంతంలో ఈ వంతెన కట్టడం వలన చాలా మంది రైతులు పంట భూములు కోల్పోయారని అందుకే ఆ ప్రాంత రైతులకు న్యాయం చేయాలని వంతెన కట్టడంవలన రైతులంతా ఆర్ధికంగా నష్టపోయారని మావోయిస్టులు పేర్కొన్నారు.