లొంగిపోయిన 62మంది మావోయిస్టులు

MAVOISTS
MAVOISTS

లొంగిపోయిన 62 మంది మావోయిస్టులు

చింతూరు: ఛత్తీస్‌ఘడ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో మంగళవారం జిల్లా యస్‌.పి.ఎదుట 62మంది మావోయిస్టులు లొంగిపోయారు.ఇది దేశ చరిత్రలోనే మావోయిస్టులు ఇంత భారీ ఎత్తున ఆయుధాలతో సహా లొంగిపోవటం మొదటిసారి.ఛత్తీస్‌గడ్‌లో ఈనెల 12న కొన్ని చోట్ల,25న కొన్ని చోట్ల ఎన్నికల పోలింగ్‌ ఉండటంతో భారీ ఎత్తున్న పోలీసు బలగాలు రంగంలోకి దిగి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి.ఇప్పటికే ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు నిచ్చిన మావోయిస్టులు అనేక చోట్ల విధ్వంసం సృష్టిస్తున్నారు.దాంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం కూడా చేయలేని పరిస్దితి నెలకొంది.రోజు ఎక్కడో ఒకచోట ఏదో ఒక ఘటన చోటు చేసుకుంటూనే ఉంది.మావోయిస్టుల కరపత్రాలు,బ్యానర్లు రోడ్లుపై పడవేసి ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు.దాంతో అప్రమత్తమైన పోలీసులు మరిన్ని బలగాలను రంగంలోకి దింపి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రయత్నాలు ప్రారంభించారు.అందులో భాగంగా నారాయణపూర్‌ జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసు బలగాలు కూబింగ్‌ చేపట్టడంతో పాటు మావోయిస్టు సానుభూతి పరులు,మిలీషియాపై ఉక్కుపాదం మోపారు.దాంతో చాలా మంది పోలీసు నిర్బంధాన్ని తట్టుకోలేక లోంగుబాట పట్టారు.