మావోల అలికిడి!

Mavoists
Mavoists

మావోల అలికిడి!

విన్పిస్తున్న బూట్ల చప్పుడు
అటవీ ప్రాంతాల్లో భయం భయం
సురక్షిత ప్రాంతాలకు నేతల పయనం
ఎన్నికల తరుణంలో నేతల్లో గుబులు

అమరావతిµ : దాదాపు దశబ్ధాన్నర కాలంగా మావోయిస్టులు – పోలీసులు మద్య అటవీ ప్రాంతాలకు చెందిన తెలంగాణా,ఆంధ్రప్రదేశ్‌,ఒడిషా,ఛత్తీస్‌గడ్‌ సరిహద్దుల్లో పరస్పర భీకరపోరుతో ఏపి సరిహాద్దు ప్రాంతాల్లోని గ్రామాల్లో మాత్రమే కొనసాగేది.అంతకు మునుపు వివిధ రాజకీయ పార్టీ నేతలు,భూస్వాములు,ఇన్‌ఫార్మర్స్‌నే మావోయిస్టులు టార్గెట్‌గా చేసుకొని పంజా విసురుతూ రాగా 2004నుంచి క్రమేపి మావోల ప్రాబల్యం తగ్గుముఖం పట్టింది.తాజాగా ఇటివల విశాఖ దుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద అరకు ఎమ్మెల్యే కిడారి.సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల మావోయిస్టులు హాతమార్చడం మావోల అలజడి మళ్ళీ మొదటికొచ్చింది.దీంతో కేంద్ర,పలు రాష్ట్రాల పోలీసులు,కేంద్ర బలగాల బూట్ల చప్పుళ్ళు మొదలైయ్యాయి.రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లోను,నాలుగు రాష్ట్రాల సరిహాద్దు పరిసర ప్రాంతాల్లో భయం…భయం…తో ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు.పలువురు టార్గెట్‌లో ఉన్న నేతలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు.సార్వత్రికలు సమీపిస్తుండడంతో రాష్ట్రంలో ఏజెన్సీ,లంక,అటవీ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేసుకోలేమని ఒక మండల,పట్టణ కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం చేసుకొన్నా తమ ప్రాణాలకు ముప్పు ఉంటుందని నేతల్లో వణుకు పుట్టుకొస్తుంది.

రెండేళ్ళక్రితం ఆంధ్రా-ఒడిషాలతోపాటు ఛత్తీస్‌గడ్‌ సరిహాద్దు ప్రాంతంలోని రాంగుడ ఎన్‌కౌంటర్‌లో 32మంది మావోయిస్టులను ఏపి పోలీసులు హతమార్చారు.అనంతరం మావోలు ఏఓబిలో తమ స్థావరాలు ఏర్పరచుకొని సంబంధిత ప్రాంతాల్లోని గిరిజన యువతను ఆకర్షించి మిలీషియా వ్యవస్థను రూపొందించి వారి ద్వారానే మహిళలను రిక్రూట్‌ చేసి వారిచే లివిటిపుట్టు వద్ద తాజాగా ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేను హతమార్చారు.మావోలు ఒడిషా, చత్తీస్‌ఘడ్‌,తెలంగాణా రాష్ట్రాలకు వెళ్ళారని రాష్ట్ర పోలీసులు ఏమరుపాటుతో ఎఓబి పరిధిలో మాన్యాలనలోను,మూడు రాష్ట్రాల సరిహాద్దుల్లో మావోయిస్టు దళాలు సామర్థ్యం పెంచుకొని తిరిగి దాడులకు శ్రీకారం చుట్టారు.రాష్ట్రంలోని విశాఖ,మన్యంలోని ప్రాంతంలోను శ్రీకాకుళం,విజయనగరం జిల్లాలు,ఓడిషా సరిహాద్దుల్లోను,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ నల్లమల అటవీ ప్రాంతాలకు చెందిన కర్నూల్‌,ప్రకాశం,కడప జిల్లా పరిసరి ప్రాంతాల్లోను,పశ్చిమ,తూర్పు గోదావరి జిల్లా సరిహద్దుల్లోని తెలంగాణా ప్రాంతాల్లో గతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నట్లుగా ఇంటెలీజెన్స్‌ అధికారులే తేల్చారు.అయితే సంబంధిత ప్రాంతాల్లో మావోయిస్టుల్లో కదలికలు లేవని పోలీసులు అంటున్నారు.గతంలో శేషాచలం,నల్లమల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండేది.తెలంగాణ రాష్ట్రాంలోను ఆప్రాంత సరిహాద్దుల్లో చత్తీస్‌ఘడ్‌ పోలీసులు-మావోయిస్టుల మధ్య కాల్పులు,కూంబింగ్‌ ప్రారంభమైతే మావోలు తెలంగాణా ప్రాంతాలతో పాటు,ఆంధ్రప్రదేశ్‌ నల్లమల అటవీ ప్రాంతాలకు తరలి వస్తున్నట్లు తెలిసింది.సురక్షిత ప్రాంతాలకు మావోయిస్టులు ఎంచుకొంటున్నట్లు తెలిసింది.గత మూడేళ్ళుగా ఎఓబి పరిధిలోను,మిలీషియా వ్యవస్థ ద్వారా దళాలను తయారు చేసుకొని వారికి శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిసింది.ఇక మావోయిస్టులు సురక్షిత ప్రాంతాలతోపాటు తెలంగాణా,నల్లమల,విశాఖ మాన్యంలో మకాం వేసిన్నట్లుగా తెలిసింది.ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రం నుండి ఏడు మండలాలు తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేయడంతో ఆ ప్రాంతంలోని మావోయిస్టులు రాష్ట్ర సరిహాద్దులో ప్రవేశించినట్లు తెలిసింది.వీరు సైతం అరకులోయ లివిటిపుట్టులో జరిగిన సంఘటనలో పాల్గొన్నట్లు తెలిసింది.నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో వేలాదిమంది పోలీసులు గాలింపుల్లో ముమ్మరంగా చేయడంతో భయానక వాతావరణం నెలకొంది.నేతల గుండేళ్ళో రైళ్ళు పరుగులు తీస్తున్నాయి.ఇక సామాన్య ప్రజానీకాన్ని పోలీసులు మరి ఒత్తిడి చేయడం,అనుమానం ఉన్నవారిని అదుపులోనికి మావోల కోసం జల్లెడ పట్టడంతో గ్రామాల్లో నిర్మానుషంగా మారి బిక్కు బిక్కుమని కాలం గడుపుతున్నారు.