గర్భిణీల్లో మెటర్నల్ షాక్

గర్భిణీల్లో ప్రసవ సమయానికి ముందు, ప్రసవసమయంలో తర్వాత రక్తప్రసరణ లోపం వల్ల షాక్ కలుగుతుంది. ఇది గర్భిణీల్లో కలిగే సీరియస్, అత్యవసర ప్రమాద పరిస్థితి. ఇది 16.3శాతం కేసుల్లో కనిపించే అబ్స్ట్రిక్ ప్రాబ్లమ్ కణాలకి కావలసిన ఆక్సిజెనెటెడ్ రక్తం, న్యూటియెంట్స్ (పోషకాలు) అందకపోవడం వల్ల కార్బన్ డయాక్సైడ్ అధికంగా చేరడం వల్ల మెటబాలిక్ అసిడోసిస్ ఏర్పడి మైక్రోవాస్కులార్ సర్క్యులేషన్లో అంతర్గత మార్పులు ఏర్పడతాయి. గర్భసంచిలోని మయోమోట్రియమ్లో మార్పులేర్పడడం వల్ల సెల్యులార్ మెటబాలిజమ్‌లో కూడా మార్పులేర్పడతాయి.
రకాలు:
ఇవి రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది రక్తస్రావం ఉన్నప్పుడు కలిగే షాక్. ఇది అబార్షన్, ప్లాసెంటా ప్రీలియా, కాన్ను సమయంలో తర్వాత కలిగే అధిక రక్తస్రావాల వల్ల మావి ప్రసవం కాకపోవడం, గర్భసంచి చీలడం, సర్వెకల్ ప్రెగ్నెన్సీ, కోయాగ్యూలేషన్ (రక్తం గడ్డకట్టే ఫ్యాక్టర్స్ లోపాలు) ఫ్యాక్టల్స్ లోపాల వల్ల కలుగుతుంది. రెండోది రక్తస్రావం లేనప్పుడు కలిగే షాక్. ఇది వాంతులు, విరేచనాలు, ఉమ్మనీరు పోవడం వల్ల కలిగే వాటర్, ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ వల్ల వస్తుంది. అంతేకాకుండా హైపోటెన్షిన్ ప్రెషర్ (లోబిపి) వల్ల కూడా వస్తుంది.
రోగి కండిషన్‌ని బట్టి రెండు దశలుగా పరిగణించవచ్చు. ప్రైమరీ లేదా ఎర్లీ స్టేజ్ ఈ దశలో ఈ ప్రారంభదశలో రోగి శరీరం వెచ్చగా ఉండి వ్యాధి లక్షణాలు మైల్డ్‌గా ఉంటాయి. బిపి నార్మల్‌గా ఉండి పల్స్ వీక్‌గా వేగంగా కొట్టుకోవడం, రోగి ఆందోళనగా, అస్థిమితంగా వీక్‌గా ఉంటారు. డిజ్జీనెస్ (తల తిరగడం), పడిపోయినట్లుంటారు. దీన్నే ప్రీ షాక్ పీరియడ్ అని కూడా అంటారు. 7-8శాతం మందిలో ప్రాథమిక దశలో మెటర్నల్ షాక్‌ని గుర్తించగలిగితే కాంప్లికేషన్స్ ఏర్పడకుండా, తల్లిబిడ్డకు ఎటువంటి ప్రాణాపాయ స్థితి కలిగకుండా అరికట్టవచ్చు.
సెకండరీ లేదా లేట్ స్టేజ్ ఈ రెండవ దశలో కేంద్ర నాడీమండలం చురుకుదనం వల్ల బిపి తగ్గడం, శ్వాసవేగం పెరగడం, రోగి పాలిపోయి చల్లని చెమటలతో నీలిరంగుగా మారడం, మెంటల్ కన్ఫ్యూజన్, నాడీ మందంగా, వీక్‌గా కొట్టుకోవడం. ఆయాసం, కాళ్లు చేతులు చల్లగా ఉండి, రక్తప్రసరణ తగ్గి రక్తకేశనాళికలు దెబ్బతినడం వల్ల మెటబాలిక్ అసిడోసిస్ ఏర్పడుతుంది. అంతర్గత అవయవాల్లో రక్తస్రావం కలగడం, మూత్రం రాకపోవడం, గుండెవేగంలో తేడా రావడం, రక్తం గడ్డకట్టడంలో ఏర్పడే జాప్యం వల్ల ప్రమాద పరిస్థితి ఏర్పడుతుంది.
ఇది 20 శాతం మందిలో ఏర్పడే అత్యవసర పరిస్థితి. కారణాలు ఆపరేషన్స్ (సిజేరియన్, ఫోర్సోప్స్ డెలివరీ. కాన్పు ఆలస్యం కావడం (దీర్ఘకాల ప్రసవం, అబ్స్ట్రక్టెడ్ ఆపరేషన్ అనస్థీలియా, గర్భాశయ మాంద్యం (యుట్రస్ ఇనర్షియా) గాయాలు పెరినీయల్, సర్వైకల్ చీలికలు). రప్చర్డ్ యూట్రస్, పల్మోనరీ ఎంబాలిజమ్, స్పాంటేనియస్ డెలివరీ, ప్లాసెంటల్ డిఫెక్ట్స్, ప్లాసెంటా ప్రీలియా మావిని చేత్తో తీసివేయడం, ప్రసవ మార్గంలో అవరోధాలేర్పడడం బాక్టీరియల్ ఇన్షెక్షన్స్ సెప్టిక్ అబార్షన్స్, సెప్టిసేమియా, ఎక్లాంప్సియా, ప్రీ ఎక్లాంప్సియా, బిపి. డయాబెటిక్, కిడ్నీ, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో ఆక్సిడెంట్స్, మెంబ్రెన్స్ ముందే పగిలిపోవడం వల్ల ఉమ్మనీరు పోవడం వంటి అనేక కారణాలు ప్రసవానికి ముందు ప్రసవ సమయంలో ప్రసవం తర్వాత మెటర్నల్ షాక్‌కి దారి తీస్తాయి.
-డాక్టర్. కె.ఉమాదేవి, తిరుపతి
తాజా కెరీర్ సమాచారం కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/