అందరికంటే కృతఘ్నడు సైతాన్‌

MASZID
MASZID

అందరికంటే కృతఘ్నడు సైతాన్‌

”మానవతా వాదం కంటే గొప్ప పుస్తకం ఏముంది? అని మహాత్మాగాంధీ మానవత్వాన్ని నిర్వచించారు. ఇంకా ఆయన ”మానవత్వం అన్నింటినీ రక్షిస్తుంది అని కూడా అన్నారు. మానవత్వం మానవజీవితానికి ఔన్నత్యాన్ని పెంపొందింపచేస్తుంది. నిజమైన మనిషి అతడు నిజమైన మానవ్ఞడు కనుక ఎల్లప్పుడు మానవత్వంతోను, శాంతిప్రియుడిగా ఉండాలి. మనిషికి మానవత్వం అనేది లేకుంటే అతడు దుర్మార్గుడవ్ఞతాడు. ప్రపంచంలోకెల్ల దుర్మార్గులైన నమ్రూద్‌, ఫిర్‌డౌన్‌లు మానవత్వంలోని దుర్మార్గులుగా ప్రసిద్ధిగాంచారు. వీరు తామే దేవ్ఞళ్ళమని ప్రకటించు కున్నారు. నమ్రూద్‌ ఇబ్రాహీం ప్రవక్తకాలంలో కాగా, ఫిర్‌డౌన్‌ మూసా అలైహిస్సలాం కాలంలోని పరమ దుర్మార్గులున్నారు. ప్రజలను అనేక విధాలుగా బాధించారు. మనసులో మానవత్వం లేకుంటే అతడు గర్విష్టి అవ్ఞతాడు. అహంకారి అవ్ఞతాడు.

అహంకారం సర్వదుర్గుణాలకు నిలయం అవ్ఞతుంది. అందరికంటె కృతఘ్నుడు సైతాన్‌. అతన్ని ఇబ్లీస్‌ అని కూడా అంటారు. అల్లాహ్‌ మొదటి మానవ్ఞడైన ఆదమ్‌ అలైహిస్సలామ్‌ను మట్టితో తయారుచేశాడు. ప్రాణం ఊదాడు. ”మీరంతా ఆదంకు సాష్టాంగ ప్రణామం చేయండిఅని తన దూతలను ఆజ్ఞాపించాడు. అప్పుడు దేవతలంతా ఆదంకు సాష్టాంగపడ్డారు. అయితే ఒక ఇబ్లీసు మాత్రం చెయ్యలేదు. ”ఓ ఇబ్లీస్‌! నేను నా స్వహస్తాలతో సృష్టించిన వాని ముందు ఎందుకు సాష్టాంగపడలేదని అడిగాడు. సైతాన్‌ నేను అతనికంటె గొప్పవాడిని. నీవ్ఞ నన్ను అగ్నితో సృష్టించావ్ఞ. అతన్నేమో మట్టితో సృష్టించావ్ఞఅని సమాధానమిచ్చాడు.

ఇదే సైతాను చేసిన ఘోరమైన తప్పిదం. మట్టికన్నా అగ్ని గొప్పదని వాడు తలపోశాడు. అర్థపర్థం లేని ఆలోచనే వానిలో అహంకారాన్ని రేకెత్తించింది. అల్లాహ్‌ ఆదంను స్వహస్తాలతో చేయడమే గాకుండా అతనిలో తన ఆత్మను ఊదాడు. మరి ఈ కోణం నుంచి ఆలోచిస్తే, అగ్నికన్నా మట్టే గొప్పదయింది. అదీగాక, కాల్చటం అగ్నిగుణం. ప్రతి వస్తువ్ఞనూ అదికాల్చి భస్మీపటలం చేసేస్తుంది. కాగా, మట్టి మొక్కల్ని మొలకెత్తిస్తుంది. రకరకాల వస్తువ్ఞల ఉత్పత్తికి దోహదపడుతుంది. మనిషి గర్వం లేక నిరాడంబరంగా జీవించే వాణ్ణి ఉత్తముడంటారు. నిరాడంబరంగా జీవించడమంటే తాను అందరికంటే తక్కువాడని అసమర్ధుడని భావిచడం కాదు.

తనకు అధికారం పదవి లభిస్తే అది దేవ్ఞని ఆశీర్వాదంగా భావించాలి గాని అది తనవల్లనే లభించిందని భావించడం తగదు. నేను నా వంతు కృషిచేశాను. దైవం మీద భారం వేశాను. ఆయనే నన్ను గట్టెక్కించాడు అనే భావనే అతనిలో ఉన్నపుడు నిరాడంబరంగా జీవితాన్ని గడపవచ్చు. మనం చేసే పనులను మనసా, వాచా, కర్మణా చేస్తూ పోతూ ఉంటే దైవం కూడా నీకు సహాయ సహకారం అందిస్తాడు.

– షేఖ్‌ అబ్దుల్‌ హఖ్‌