ఏపీలో కరెంట్ కోతలు ..ఆసుపత్రిలలో అల్లుడుతున్న పసిపిల్లలు

ఏపీ ప్రజలను కరెంట్ కష్టాలు వెంటాడుతున్నాయి. అసలే ఎండాకాలం..బయట అడుగుపెట్టాలంటే ప్రజలు భయపడుతున్నారు..అలాని ఇంట్లో ఉంటె ఒకటే ఉక్కపోత దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం , మధ్యాహ్నం , రాత్రి ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ ను తీసేస్తున్నారు. కరెంట్ పోతే దాదాపు రెండు , మూడు గంటల వరకు రావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కనీసంగా 4 నుంచి 5 గంటల పాటు విద్యుత్ ఉండని పరిస్థితులు నెలకొన్నాయి. ఇంట్లో ఉక్కపోత, బయట దోమలమోత వెరసి.. కాళరాత్రుల్లో జాగారం చేస్తున్నామంటున్నారు.

ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో పసిపిల్లల తల్లులు రాత్రంతా విసనకర్రతో గాలి విసురుతూ కూర్చోవాల్సి వస్తోంది. జనరేటర్ లేదా అని అడిగితే కొన్ని ఆసుపత్రిలలో లేదు అని సమాధానం చెపుతుండగా, మరికొన్ని హాస్పటల్ లలో డీజిల్ లేదని చెపుతున్నారు. దీంతో హాస్పటల్ యాజమాన్యం ఫై పేషంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ పల్లెల్లో వీధులు నిశీధులుగా మారటం ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని గ్రామాల్లో దశలవారీగా రోజుకు 14 గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోంది. ఫిర్యాదు కేంద్రాలకు ఫోన్‌ చేస్తున్నవారు పరుష పదజాలంతో మాట్లాడుతున్నారని ప్రజలు అంటున్నారు. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటె వచ్చే నెలలో ఇళ్లలో అసలు కరెంట్ అనేది ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.