గన్నవరం పాలిమర్స్‌ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..

గన్నవరం పాలిమర్స్‌ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..

కృష్ణ జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌తో విజయ పాలిమర్స్‌ కంపెనీలో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు క్షణాల్లోనే ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి, నల్లటి పొగ పెద్ద ఎత్తున్న ఆ ప్రాంతం అంతా కమ్ముకుంది.

ఈ మంటలను చూసి స్థానికులు స్థానికులు భయాందోళనకు గురయ్యారు, స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిశ్రమలో ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన కారణాలు కూడా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందా ? లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.