కాలిబూడిదైన విజయ్‌ మూవీ సెట్‌

vijay
vijay

ఈ మధ్య కాలంలో మూవీ సెట్స్‌లో అగ్నిప్రమాదాలు జరుగుతుండటంతో చిత్ర నిర్మాతలు కలవరపడుతున్నారు. ఈ వారంలో కరణ్‌జోహార్‌ స్టూడియోలో ,నిన్న సైరా మూవీ సెట్‌ అగ్నికి ఆహుతి అయింది. తాజాగా విజయ్‌ మూవీ సెట్‌ మంటలలో పూర్తిగా కాలిపోయింది. దీంతో లక్షల విలువైన సామాగ్రి, సెట్‌ అంతా బూడిదయ్యింది. విజయ్‌ ప్రస్తుతం తన 63వ సినిమాని అట్లీ దర్శకత్వంలో చేస్తున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తుంది. చెన్నై మీనంబాకంలోని బిన్ని మిల్లు ప్రాంతంలో ఆసుపత్రి, మెడికల్‌ దుకాణం, పాఠశాల ,ఆలయం సెట్‌ వేసి షూటింగ్‌ జరుపుతున్నారు. ఐతే దీనికి పక్కనే మరో సెట్‌ వేసే క్రమంలో ఇనుప కమ్మీలకు వెల్డింగ్‌ చేస్తున్నారు. వెల్డింగ్‌ చేసేటపుడు నిప్పు రవ్వలు పక్కనే ఉన్న ఎండిన ఆకులపై పడి మంటలు వ్యాపించాయి. అవి క్రమక్రమంగా పాకుతూ సెట్‌ అంతటా వ్యాపించి కాలిబూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది సుమారు నాలుగు గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారు. మీనంబాకం పోలీసులు విచారణ జరుపుతున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/