ఆఫ్ఘనిస్థాన్ లో భారీ పేలుడు : 18మంది మృతి

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో భారీ పేలుడు సంభవించింది. పేలుళ్లతో ఆఫ్గనిస్థాన్ దద్దరిల్లుతోంది. ప్రార్థనా మందిరంలో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుళ్లలో 18మంది మృతిచెందగా, 60మందికి పైగా గాయాలయ్యాయి. ఉత్తర ఆఫ్ఘన్‌ నగరమైన మజార్-ఎ-షరీఫ్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. సై డోకెన్‌ ప్రాంతంలోని షియా మసీదులో శక్తివంతమైన బాంబు పేలింది.

రంజాన్‌ మాసం నేపథ్యంలో మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారిలో పది మందికిపైగా చనిపోయారని, 40 మందికిపైగా గాయపడ్డారని ఏపీ వార్తా సంస్థ పేర్కొంది. బాంబు పేలుడులో గాయపడిన వారిని కార్లు, అంబులెన్స్‌లలో ప్రధాన ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరుగవచ్చని చెప్పారు. అయితే బాంబు పేలుడులో కనీసం 18 మరణించి ఉంటారని, 40 మంది గాయపడినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/