మసాజ్‌ టెక్నిక్‌

Massage
Massage

ఉరుకుల పరుగుల జీవితం. దానికి తోడు పని ఒత్తిడి వల్ల అలసిపోయి ఇంటికి చేరుకునే వారే ఎక్కువ. అలాంటప్పుడు పదిహేను నిమిషాల మసాజ్‌ టెక్నిక్‌తో కండరాలకు రక్తప్రసరణ పెరిగి ఒత్తిడి మాయం అవుతుంది. మనసు తేలిక పడుతుంది. అంటున్నారు పరిశోధకులు. అదెలాగంటే భోజనం చేశాక చేతుల్ని పొట్ట మీద ఉంచి సవ్యదిశలో మసాజ్‌ చేసుకోవాలి. ఇలాచేస్తే జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది. ఫలితంగా ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

రోజు చేతులకు లోషన్‌ రాసుకున్న తరువాత రెండు అరచేతులను మసాజ్‌ చేసుకోవాలి. చేతి బొటన వేళ్లతో వలయాకారంలో చేతి మడిమల మీద మర్దన చేసుకోవాలి. చేతి బొటన వేళ్లతో వలయాకారంలో చేతి మడిమల మీద మర్దన చేసుకోవాలి. దీంతో వేళ్ల మధ్య చర్మం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. చేతులతో మెడ మెనుక మసాజ్‌ చేసుకుంటే వెన్నెముక ఇరువైపులా రిలీఫ్‌ లభిస్తుంది. మెడను కుడి, ఎడమ పక్కకు ఉంచి భుజాల వరకూ మసాజ్‌ చేస్తే అక్కడి కండరాలు సాంత్వన పొందుతాయి. ఎక్కువ సమయం కంప్యూటర్‌ స్క్రీన్‌ వంక చూడడం వల్ల కళ్ల మీద ఒత్తిడి పడుతుంది.

అలాంటప్పుడు అరచేతులను ఒక దానితో ఒకటి వేడి పుట్టేదాకా రుద్దాలి. వెంటనే రెండు అరచేతుల్ని రెండు కళ్లమీద ఉంచితే వాటి వేడికి కళ్లకు అలసట, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. చేతివేళ్లు అలసి పోయినట్లు అనిపిస్తే స్ట్రెస్‌ బాల్‌ను ప్రెస్‌ చేస్తూ రిలాక్స్‌ అవ్వొచ్చు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/