వివాహితపై సామూహిక అత్యాచారం

నిందితులపై కఠిన చర్యలు, బాధితురాలికి న్యాయం చేస్తామని డిఎస్పీ హామీ

Mass rape of a married woman
Mass rape of a married woman

Kurnool: కర్నూల్‌ జిల్లా వెలుగోడు పోలీసు స్టేషన్‌ పరిధిలోని జమ్మినగర్‌ తండాలో  దంపతులపై ఆకతాయిలు దాడి చేశారు.

నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో వెలుగోడు సమీపంలో తన భర్తతో కలిసి వెళ్తున్న ఓ వివాహితను నలుగురు దుండగులు ఆపారు.

ఆ తర్వాత భర్తను లాక్కెళ్లి చితకబాదారు. అనంతరం ఆమెపై నలుగురు కలిసి సామూహిక అత్యాచారం చేశారు.

బాధితురాలిని కూడా దారుణంగా కొట్టారు. తమకు జరిగిన అన్యాయంపై వెలుగోడు పోలీసులను బాధితులు సంప్రదించారు.

నలుగురు దుండగులపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు.

వెలుగోడు పోలీసు స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దీంతో స్పందించిన డీఎస్పీ దుండగులను పట్టుకుని కఠినచర్యలు తీసుకుంటామని, బాధితురాలికి అన్నివిధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/