గుంటూరు జిల్లాలో మహిళఫై సామూహిక అత్యాచారం..

ఏపీలో వరుసగా యువతుల ఫై అత్యాచారాలు , హత్య లు జరుగుతూనే ఉన్నాయి. ఓ పక్కా రాష్ట్రంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతుందని విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉండగా..ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లు మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి లో యువతీ ఫై అత్యాచార ఘటన ఇంకా మాట్లాడుకుంటుండగానే..మరో ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం..చేసి హత్య చేసిన ఘటన బయటకొచ్చింది.

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి లో మహిళని సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. పోలీసుల అందించిన సమాచారం మేరకు..తుమ్మపూడి కి చెందిన వీరంకి తిరుపతమ్మ (35) పొలాలకు నీళ్లు పెట్టె పైపులు అద్దెకిస్తూ జీవనం సాగిస్తుంటుంది. ఆమె భర్త శ్రీనివాసరావు పనుల కోసం తిరుపతి వెళ్లారు. వీరికి ఇద్దరు పిల్లలు.ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో మృతిచెంది పడి ఉండడాన్ని గుర్తించారు. తిరుపతమ్మ మృతదేహంపై గోళ్ళ తో రక్కిన గాయాలు, కొరికిన గాట్లు ఉన్నట్లు గుర్తించారు. దుస్తులు కూడా లేకపోవడంతో సామూహిక అత్యాచారం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. కాగా యువతి మృతదేహాన్ని పోలీసులు తెనాలి ప్రభుత్వాసుపత్రి మార్చరీకి తరలించారు. ఈ ఘటన పట్ల కేసు నమోదు చేసిన పోలీసులు..నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.