మాస్కు లేదంటే 1000 జరిమాన

గుంటూరులో నిబంధనలు కఠినం చేసిన కలెక్టర్‌

samuel anand
samuel anand

గుంటూరు: జిల్లాలో కరోనా కేసుల ఇప్పటికే 51 నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ఇందుపల్లి శాముల్‌ ఆనంద్‌కుమార్‌, జిల్లా ప్రజలు తప్పని సరిగా మాస్కులు ధరించాలని, లేకుంటే వెయ్యి రూపాయలు జరిమాన విధిస్తామని హెచ్చరించారు. రోజు ఉదయం పూట రైతు బజార్లకు వెళ్లెవారు, అత్యవసర పనుల నిమిత్తం బయటకు వచ్చేవారు సైతం విధిగా మాస్కులు ధరించాలని చెప్పారు. నేటి నుంచి నిబంధనలు కఠినం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉదోగులు తమ ఐడి కార్డులను చూపించి కలెక్టరేట్‌లో పాస్‌లు పోందవచ్చని తెలిపారు. ఉద్యోగులు ఉదయం 10 గంటలలోపు కార్యాలయాలకు వెళ్లాలని, సాయంత్రం 5 నుండి 7 గంటలలోపు అందరు ఇంటికి వెళ్లిపోవాలని కలెక్టర్‌ సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/