మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి.. ఒడిశా

ఈ నెల 9 నుంచి తప్పనిసరి చేసిన నవీన్‌ పట్నాయక్‌ సర్కార్‌

mask
mask

భువనేశ్వర్‌: ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి కోనసాగుతున్నందున, వ్యాప్తి నివారణకు దేశం మొత్తం లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి నివారణకు ప్రస్తుతం ఒడిశా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఇంటి నుండి బయటకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పకుండా మాస్క్‌ ధరించాలనే నిబంధనను తెచ్చింది. ఈ నిబంధనను ఏప్రిల్‌ 9 నుంచి అమలు చేయనున్నట్లు నవీన్‌ పట్నాయక్‌ సర్కార్‌ తెలిపింది. మాస్కులు లేకుంటే, కర్చీఫ్‌లు, చున్నీలతో అయిన నోరు ముక్కు కవర్‌ చేసుకోవాలని తెలిపింది. కాగా ఇప్పటి వరకు మాస్కును తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రం ఒడిశాయే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/