సైదాబాద్ నిందితుడు మారువేషాల్లో తిరుగుతున్నాడా..?

ఆరేళ్ల చిన్నారిని అతి దారుణంగా అత్యాచారం చేసి , చంపేసిన నీచుడు మారువేషాల్లో తిరుగుతున్నాడా..? ఇదే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తూ ఆ నిందితుడికి సంబంధించి మరిన్ని ఫోటోలు విడుదల చేశారు. ‘ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు నిందితుడు మారు వేషాలతో తిరిగే అవకాశం ఉన్నందునా… జట్టు,గడ్డం వంటి మార్పులతో నిందితుని పోలి ఉండే చిత్రాలను విడుదల చేస్తున్నాం.గమనించగలరు.’ అని హైదరాబాద్ పోలీస్ ట్విట్టర్‌లో వెల్లడించారు.

సంఘటన జరిగి ఆరు రోజులు అవుతుంది. కానీ నిందితుడి ఆచూకీ మాత్రం లభించలేదు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు రాజు ను పట్టుకోవాలని సూచించారు. బస్టాండ్ , రైల్వే స్టేషన్ , వైన్ షాప్ , హోటల్స్ , థియేటర్స్ ఇలా పబ్లిక్ ప్లేస్ లలో రాజు ఫోటోలు అంటించి ఆచూకీ తెలుపగలరని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం..రాజు LB నగర్ లో ఓ ఆటో దొంగతనానికి ట్రై చేసినట్లు తెలుస్తుంది. అక్కడ ఓ వైన్ షాప్ లో మద్యం సేవించి..ఉప్పల్ బస్ ఎక్కినట్లు అక్కడి సీసీ ఫుటేజ్ లో తేలింది. ఉప్పల్ నుండి ఎటు వెళ్లాడనేది దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బస్సు డ్రైవర్స్ ను , కండక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజు ఫోటోలు విస్తృతంగా షేర్ అవుతున్నాయి.వాట్సాప్,ఫేస్‌బుక్,ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా రాజు ఫోటో జనాల్లోకి వెళ్లింది. నిందితుడు ఎక్కడ కనిపించినా పట్టించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. నిందితుడు రాజు ఆచూకీ తెలియజెప్పినవారికి రూ.10లక్షలు రివార్డుగా అందజేస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిందితుడు రాజు ఆనవాళ్లను సీపీ అంజనీకుమార్‌ విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపినవారి వివరాలను చాలా గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. సుదీర్ఘ చర్చల అనంతరం తాము రివార్డు ప్రకటిస్తున్నామన్నారు. నిందితుడు రాజు వయస్సు సుమారు 30 ఏళ్లు ఉంటుందని… అలాగే ఎ్తతు… సుమారు 5.9 అడుగులు ఉంటాడని చెప్పారు. నిందితుడి చేతులపై మౌనిక అనే టాటూ కూడా ఉంటుందన్నారు. ఆచూకీ తెలిసిన వారు 9490616366 మరియు 9490616627 అనే ఫోన్‌ నంబర్ల కు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్‌ సీపీ తెలిపారు.

ఎవరు గుర్తుపట్టకుండ ఉండటానికి నిందితుదు మారు వేషాలతొ తిరిగే అవకాశం ఉన్నందున,
జుత్తు, గడ్డం వంటి మార్పులతో నిందితుని పోలి ఉండే చిత్రాలను విడుదల చేస్తున్నాము
గమనించగలరు. pic.twitter.com/XDM9eWfAaO— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) September 15, 2021