చిన్న కార్లపై దృష్టి సారించిన మారుతీ

జనవరీలో మారుతీ మొత్తం 1,79,103 కార్లను ఉత్పత్తి చేసింది

Maruti-Suzuki-Shifts-Production-Focus-To-Small-Cars
Maruti-Suzuki-Shifts-Production-Focus-To-Small-Cars

న్యూఢిల్లీ: ఇండియా కార్‌ మేకర్‌ దిగ్గజం మారుతీ సుజుకీ చిన్న కార్లపై దృష్టి సారించింది. సెడాన్‌లు, కాంపాక్ట్‌ ఎస్‌యూవీల పైనుంచి దృష్టిని చిన్న కార్లపైకి మళ్లించింది. చిన్నకార్ల ఉత్పత్తిని వేగవంతం చేసింది. జనవరీలో మారుతీ మొత్తం 1,79,103 కార్లను ఉత్పత్తి చేసింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2.1 శాతం తక్కువ. కాకపోతే మారుతీ చిన్నకార్ల ఉత్పత్తిని పెంచి..సెడాన్లు, కాంపాక్టు ఎస్‌యూవీ కార్ల ఉత్పత్తిని తగ్గించింది. చిన్న కార్ల సెగ్మెంట్‌లో ఆల్టో, ఎస్‌ప్రెస్సోల వాటా దాదాపు 25.10 శాతంగా ఉంది. అంటే 34,288 కార్లను ఈ జనవరిలో తయారు చేసింది..గతేడాది ఇదే సీజన్‌లో వీటి సంఖ్య 27,408గా ఉంది. ఇక కాంపాక్టు కార్ల సెగ్మెంట్లోకి వచ్చే డిజైర్‌, స్విఫ్ట్‌, బాలినో, కొత్త వేగనార్‌ వాటి ఉత్పత్తి కూడా 6.31 శాతం పెరిగింది. మరో పక్క విటార బ్రెజా, ఎర్తిగా, ఎక్స్‌ఎల్‌6, ఎస్‌క్రాస్‌ వంటి మోడళ్ల ఉత్పత్తిలో 37.33 శాతం తగ్గుదల కనిపించింది. విటారా బ్రెజా బీఎస్‌ 6 మోడల్‌ మార్కెట్లోకి వచ్చాక వీటి ఉత్పత్తి కూడా పెరుగుదల కనిపించవచ్చని కంపెనీ వర్గాలు అంటున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/