రెండో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతం రోజున నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 671.15 పాయింట్లు నష్టపోయి 59,135.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 176.70 పాయింట్ల నష్టంతో 17,412.90 దగ్గర స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.03 వద్ద కొనసాగుతుంది.