కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులతో మళ్లీ టెన్షన్లు పెరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్లలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు అప్రమత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,189 పాయింట్లు నష్టపోయి 55,822 వద్దకు పడిపోయింది. నిఫ్టీ 371 పాయింట్లు కోల్పోయి 16,614కి దిగజారింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/