ఏపీలో మావోయిస్టుల దుశ్చర్య : బస్సుకు మావోయిస్టుల నిప్పు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చింతూరు మండలంలోని కొత్తూరు దగ్గర ఆదివారం రాత్రి మావోయిస్టులు ప్రైవేట్ బస్సుకు నిప్పుపెట్టారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా మావోయిస్టులు ఆపి, అందులో ఉన్న ప్రయాణికులను కిందికి దింపి, ఆ తర్వాత బస్సుకు నిప్పుపెట్టి అక్కడినుంచి వెళ్లిపోయారు. మావోయిస్టులు దండకారణ్యం బంద్‌కు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.. అందుకే ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే రాత్రి వేళ ఈ ఘటన కావడంతో బస్సులో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.

బస్సుకు నిప్పు పెట్టడం అది పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సరిహద్దులో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు.