మావోయిస్టు నేత కత్తి మోహన్ రావు మృతి

మావోయిస్టు పార్టీ ప్రకటన

Maoist-leader-Katti-mohan-Rao -File

Hyderabad: మావోయిస్టు పార్టీ క్రియాశీలక నేత కత్తి మోహన్ రావు (అలియాస్ ప్రకాశన్న, అలియాస్ దామ దాదా ) మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ ఈనెల .10న తుదిశ్వాస విడిచారని ఈ మేరకు మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఆయన మృతి పట్ల మావోయిస్టు పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
మహబూబ్ నగర్ జిల్లా భయ్యారం మండలంలోని గార్ల గ్రామం మోహన్ రావు స్వస్థలం. ఇంటర్ మహబూబాబాద్‌లో, డిగ్రీ ఖమ్మంలో కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సీ పీజీ పూర్తి చేశారు. డబుల్ గోల్డ్ మెడలిస్టు. 1982లో విప్లవ జీవితంలోకి ప్రవేశించి , 1985లో ఆయన ఖమ్మంలో అరెస్ట్ అయ్యి ఆరేళ్లు జైలు జీవితం అనుభవించారు. అనంతరం బయటకు వచ్చి మళ్లీ విప్లవ జీవితాన్ని ప్రారంభించారు. ఆనాటి నుంచి అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. దండకారణ్యంలో విప్లవ పాఠాలు బోధించారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/