కోబ్‌ బ్రయంట్‌ మృతికి పలువురు క్రీడా దిగ్గజాల సంతాపం

kobe bryant and his daughter
kobe bryant and his daughter

ముంబయి: అమెరికా బాస్కెట్ బాల్ చరిత్రలో తిరుగులేని ఆటగాడి ఖ్యాతి పొందిన కోబ్ బ్రయాంట్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో క్రీడా ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ ప్రమాదంలో కోబ్ కుమార్తె గియాన్నా కూడా మృతి చెందడం ఆయన అభిమానులకు గుండెకోతగా మారింది. కోబ్ మరణవార్తతో ప్రపంచ క్రీడా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కోబ్ బ్రయాంట్ కుమార్తెతో సహా మరణించాడని తెలిసి తీవ్ర విషాదానికి లోనయ్యానని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. టెన్నిస్ గ్రేట్ నోవాక్ జకోవిచ్ సైతం కోబ్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. గొప్పమార్గదర్శి, మిత్రుడు ఇక లేనందుకు నా హృదయం నిజంగా రోదిస్తోంది అంటూ జకోవిచ్ ట్వీట్ చేశాడు. అటు క్రికెటర్ కేఎల్ రాహుల్ కూడా సంతాపంగా ట్వీట్ చేశాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/