పిల్లలకు ఎన్నో అవకాశాలు

పిల్లలకు ఎన్నో అవకాశాలు
Many opportunities for children

పిల్లల్ని తీర్చిదిద్దడం ఒక గొప్పకళ. ప్రతి మనిషికి బాల్యం అనేది ఒక బంగారు బాటలాంటిది. వృద్ధాప్యం ఉండకపోవచ్చుగాని బాల్యం అనేది భగవంతుడిచ్చిన వరం. అమాయకత్వం, ఆత్మీయత, ప్రేమ, అనురాగాలు కలిగినవి. ఈ దశలో ఎలా మలిచితే అలా మారిపోతారు. ఇక్కడ బోయవాడు, సన్యాసి, చిలుకల్ని పెంచేవిధానం అన్వయించవచ్చును.

మనదేశంలో తల్లిదండ్రులు పిల్లల్ని చదువ్ఞకోసం రోజుకి 18 గంటలైనా కష్టపెడుతున్నారు. మూడేళ్లు రాగానే చదువ్ఞల పరుగులు. ఎల్‌కెజీకే అధిక ఫీజులు, అంతస్తుల్లో ఉన్న సూళ్లు, గాలి వెలుతురురాని ఎసి రూమ్‌లు. ఫ్లడ్‌లైట్స్‌ అధిగమిస్తున్నాయి. నేడు విద్యావిధానంతో ధనమే రాజ్యమేలుతుంది. పిల్లలకి 3వ యేడు కాకుండా గతంమాదిరి 5 లేక 6 ఏళ్లు వచ్చేవరకు పిల్లలకి స్కూలు చదువ్ఞ అవసరం లేకుండా ఇంటివిద్య నేర్పడమే మంచిది.

ఇక్కడ పిల్లలే కాదు టీచర్లు కూడా అధిక సమస్యల నెదుర్కొంటున్నారు. తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలు కూడా స్కూలు ఫీజుల ప్రకారం మొత్తం పరుగులతో సరిపోతుంది. దేశభవిష్యత్తు పిల్లలపై ఆధారపడి ఉంది. కొందరు డబ్బున్నవారు తమ పిల్లలు సరిగ్గా చదవకుండా, పేదలు, సామాన్య పిల్లలు బాగా చదివితే దాన్ని ఇష్టపడరు. నాకు తెలిసిన ఒక టీచర్‌ చెప్పింది. ఓ వ్యవసాయదారుడి కొడుక్కి ఫస్టుమార్కు సైన్సులో వచ్చింది. డాక్టర్‌కు కొడుక్కి రాలేదు.

అందుకని ఆ డాక్టర్‌ భార్య వచ్చి ఆ టీచర్‌ని ఎందుకు మా అబ్బాయికి తక్కువ మార్కులేసావని గద్దించి హెచ్‌ఎం ద్వారా అడిగించింది. ఆ టీచర్‌ ఎంతో నొచ్చుకుంది. తల్లిదండ్రుల ప్రవర్తనపై పిల్లల జీవితాలు ఆధారపడి ఉంటుంది. కేవలం చదువ్ఞ డబ్బేకాదు. వారి ప్రవర్తనపై పిల్లల ప్రవర్తన ఉంటుంది. డాక్టర్‌ కొడుకు డొనేషన్లతో చదివిస్తే, డాక్టర్‌ చదివి అమెరికాకు వెళ్తాడు. రైతు కొడుకు ఓ కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. ఒక చిన్న ఆనందం కూడా కన్నవాళ్లకి ఉండకూడదు.

చదివించాలి. కథలు చెప్పాలి. కేవలం హోమ్‌వర్క్‌ మాత్రమే కాదు. ఆటలు, పాటలు, నృత్యం, పేయింటింగ్‌, యోగా వంటివి కూడా క్లాసులలో ఉండాలి. ఇప్పుడు చాలామంది విద్యావంతుల్ని తమ పిల్లల్ని కేవలం కాగితాల మధ్య నాల్గుగోడలకి పరిమితం కాకుండా విద్యవిషయాలతోపాటు, కళావిద్యలకు కూడా ప్రామ్యు తనిచ్చి, ఆ విధంగా నేర్పే స్కూల్స్‌లలో చేర్పించాలి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/