పండుగనాడు న్యూఢిల్లీలో పలు అగ్నిప్రమాదాలు

Delhi fire
Delhi fire

న్యూఢిల్లీ: దీపావళి పండుగ సమయంలో ఢిల్లీ మరింత కాలుష్యం కానున్నదని, న్యూఢిల్లీ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని గత రెండురోజుల క్రితమే నాసా హెచ్చరించింది. అయినా వేడుకల సందడి మాత్రం అక్కడ తగ్గలేదు. పండగ సమయంలో ఇక్కడ భారీగా అగ్నిప్రమాదాలు జరిగాయి. దాదాపు రెండువందలకు పైగా ఫోన్‌కాల్స్‌ తమకు వచ్చాయని ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ విభాగం అధికారులు వెల్లడించారు. పలుచోట్ల క్రాకర్స్‌ వల్ల డంపింగ్‌యార్డులు తగలబడ్డాయి. ప్రముఖ మార్కెట్‌ దుకాణంలో బాణసంచా కాల్చడం వల్ల అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో పలు ప్లాస్టిక్‌ బొమ్మలు ఈ షాపులో కాలిపోయాయి. కొన్నిప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు పేలడం, విద్యుత్‌ తీగలు కాలిపోవడం వంటి ఘటనలు కూడాచోటు చేసుకున్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/